KTR: అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు అనేలా ప్రభుత్వ తీరు ఉన్నదని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్(KCR) పానలో ప్రగతిబాట పట్టిన పల్లెలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అధోగతి బాట పట్టాయని కీలక వ్యాఖ్యలు చేశారు. 14 నెలలుగా కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు నిధులు ఆగిపోయాయని అన్నారు.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
దీంతో 12,754 గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) నిర్వాకంతో పారిశుధ్యం కూడా అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పచ్చబడ్డ పల్లెలు.. నేడు ఎండుతున్నాయని అన్నారు. తాగునీటి కోసం ప్రజలు గోస పెట్టే పరిస్థితులు వచ్చాయని తెలిపారు. అంతేకాదు.. వీధి దీపాలు కూడా ఎక్కడా వెలగట్లేదని అన్నారు.
హరితహారం(Haritha Haram)లో మొక్కలు నాటించి.. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణ, మొక్కల సంరక్షణకు ట్రాక్టర్ల ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్(KCR)దే అన్నారు. బీఆర్ఎస్(BRS) హయాంలో నిర్మించిన వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో దేశానికే అదర్శంగా నిలిచి అవార్డులు అందుకున్నాయని గుర్తుచేశారు.
అమ్మ పెట్టదు
— KTR (@KTRBRS) March 24, 2025
అడుక్క తిననివ్వదు
పల్లెలు నాడు కేసీఆర్ గారి పాలనలో ప్రగతి బాట
15 నెలల కాంగ్రెస్ పాలనలో
అధోగతి బాట
14 నెలలుగా సర్పంచులు లేక కేంద్రం నుండి ఆగిన నిధులు .. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
12,754 గ్రామ పంచాయతీల్లో పడకేసిన పాలన
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో… pic.twitter.com/uDMAA6iFm5