KTR: ప్రమాణ పత్రం ఇవ్వాలనే దిక్కుమాలిన రూల్ ఏంటి..? కేటీఆర్ హాట్ కామెంట్స్

రాష్ట్రంలో ప్రమాణ పత్రం ఇస్తేనే ‘రైతు భరోసా’ (Raithu Bharosa) ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అదేం దిక్కుమాలని రూల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు.

Update: 2025-01-03 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రమాణ పత్రం ఇస్తేనే ‘రైతు భరోసా’ (Raithu Bharosa) ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అదేం దిక్కుమాలని రూల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. రైతు శాసించేలా కేసీఆర్ (KCR) చూశారని.. నేడు రైతులు యోచించేలా కాంగ్రెస్ సర్కార్ (Congress Government) చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రైతుబంధు (Raithu Bandhu) ఒక సీజన్ ఎగ్గొట్టారని.. అది కూడా రైతులకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అసలు ప్రమాణ పత్రం ఇవ్వాల్సిందే రైతులు కాదని.. ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఏ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేశారో లిస్ట్ పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు.

అదేవిధంగా భూ యజమానులు, కౌలు రైతుల జాబితాలు కూడా పెట్టాలని అన్నారు. గ్రామాల వారీగా రైతు కూలీల లెక్కలు పెట్టాలని సవాల్ విసిరారు. ‘రైతు‌బంధు’ పథకాన్ని బొంద పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ (KCR) ఆనవాళ్లు లేకుండా చేసేందుకే ‘రైతుబంధు’ ను చంపేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.22 వేల కోట్ల రుణమాఫీ నిధులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు ‘రైతు భరోసా’కు మళ్లీ కొత్తగా దరఖాస్తులు ఎందుకు ఇవ్వాలో’ చెప్పలన్నారు. రైతు డిక్లరేషన్ (Raithu Declaration) పేరుతో కాంగ్రెస్ ఎన్నో కథలు చెప్పిందని.. రేవంత్ సర్కార్ (Revanth Government) అర పైసా కూడా రైతులకు ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు.  

Tags:    

Similar News