Poonam Kaur : త్రివిక్రమ్ పై చర్యలేవి...నటి పూనమ్ కౌర్ ట్వీట్..మా స్పందన
టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)పై నటి పూనమ్ కౌర్(Actress Poonam Kaur) మరోసారి ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)పై నటి పూనమ్ కౌర్(Actress Poonam Kaur) మరోసారి ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. నా జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని ఎన్ని సార్లు మా అసోసియేషన్(MAA Association) కు కంప్లైంట్ ఇచ్చిన కనీసం ప్రశ్నించారా అంటూ మా అసోసియేషన్ ను ప్రశ్నిస్తూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. గతంలో తాను మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని.. ఇప్పటిరవరకు దానిపై ఎలాంటి స్పందన లేదంటూ ప్రశ్నించింది. తన ఫిర్యాదు మేరకు త్రివిక్రమ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం జరగలేదంటూ నిలదీసింది. పూనమ్ కౌర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా పూనమ్ కౌర్ ట్వీట్ పై స్పందించిన మా అసోసియేషన్ కోశాధికారి శివబాలాజీ(Shiva Balaji) రిప్లై ఇచ్చారు. పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. మా టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులలో లేదని, పూనమ్ కౌర్ ట్విట్టర్ లో పెట్టడం వల్ల ఉపయోగం లేదని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ ను కానీ, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. మా స్పందనపై పూనమ్ కౌర్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పూనమ్ కౌర్ తెలుగు సినిమాలతో పాటు తమిళ , కన్నడ బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తరుచు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ లపై ఆరోపణలతో వార్తల్లో నిలుస్తుంది.