Kevvu Karthik : పుష్ప 2 గంగమ్మ జాతర గెటప్ లో జబర్దస్త్ నటుడు.. ఇప్పుడు అవసరమా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
పుష్ప 2 మూవీలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.
దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. పుష్ప మూవీకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 (Pushpa 2) . బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే.. ఇప్పటికే రూ. 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 ని బ్రేక్ చేసింది పుష్ప 2.
పుష్ప 2 మూవీలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అల్లు అర్జున్ చీర కట్టుకొని, నగలు పెట్టుకొని గంగమ్మ తల్లి జాతరలో డ్యాన్స్ చేయడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ గెటప్ తో అదిరిపోయే ఫైట్ కూడా చేశాడు. దీంతో, ఈ సీక్వెన్స్ ను ఆడియెన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. కొందరైతే అల్లు అర్జున్ లాగే చీర కట్టుకొని థియేటర్స్ లో సందడి చేశారు.
ఈ గెటప్ వేసుకుని ఇప్పటికే ఎంతో మంది రీల్స్ చేశారు. తాజాగా, జబర్దస్త్ నటుడు కెవ్వు కార్తీక్ ( kevvu karthik)అల్లు అర్జున్ లాగే చీరకట్టి, మేకప్ వేసుకుని జాతర గెటప్ లో లాగా తయారయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. జబర్దస్త్ లో పుష్ప 2 స్కిట్ కార్తీక్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది అల్లు అర్జున్ మీద పడుతున్నారు, మళ్ళీ ఈ ప్రయోగాలు జబర్దస్త్ లో కూడా ఎందుకు బ్రో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.