Sree Leela: అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న యంగ్ బ్యూటీ.. వీడియో వైరల్

యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నది.

Update: 2025-01-08 04:30 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. ఇక రీసెంట్‌గా ఐకాన్ స్టార్‌తో కలిసి ‘పుష్ప-2’ సినిమాలో కిస్సిక్ అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది. తన డ్యాన్స్‌తో ఆడియన్స్‌ని కట్టి పడేసింది. ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటూ మళ్లీ బిజీ బిజీగా ఉంటుంది. కాగా ఈ అమ్మడు డ్యాన్స్‌కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గత కొన్ని రోజులుగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని కొన్ని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఆ వార్త నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది. ఇందులో భాగంగా ఈ బ్యూటీ ఏకంగా స్టార్ హీరో తనయుడితో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అది కూడా హారర్ మూవీలో నటించబోతోందట. ఇంతకీ అతను మరెవరో కాదండోయ్ సైఫ్ అలీఖాన్ నట వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్. తాజాగా శ్రీలీల, ఇబ్రహీం అలీ ఖాన్ కలిసి చాలా క్యాజువల్ లుక్స్‌లో దర్శనమిచ్చారు.

అయితే ఈ వీడియోలో ఇబ్రహీం చేతిలో స్క్రిప్ట్ బుక్‌ను పట్టుకొని కనిపించాడు. అంతేకాకుండా ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. బాలీవుడ్‌కు కొత్త జంట దొరికేసిందోచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Full View

( Instagram Post Crediti to Instant Bollywood Instagram page )

Tags:    

Similar News