2025: ఆస్కార్ రేసులో నిలిచిన ఇండియన్ సినిమాలు

ఈ ఏడాది (2025) ఆస్కార్(Oscar) బరిలో నిలిచిన సినిమాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Update: 2025-01-08 14:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది (2025) ఆస్కార్(Oscar) బరిలో నిలిచిన సినిమాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎవరూ ఊహించని మూవీస్ ఆస్కార్ రేసులో నిలవడం విశేషం అని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్లకు అత్యధిక నష్టాలను తెచ్చిపెట్టిన కంగువ(Kangava) చిత్రం ఆస్కార్ రేసులో ఉండి.. జనాల్ని నిజంగా షాక్ కు గురి చేసింది. 1000 సంవత్సరాల క్రితం ఆదిమ తెగల మధ్య జరిగిన ముద్ధాల ఆధారంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీకి శివ(Shiva) దర్శకత్వం వహించారు. ఇందులో దిశాపటానీ(Dishapatani), బాబీ డియోల్(Bobby Deol) వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించారు.

ఈ మూవీతో పాటు ఆడుజీవితం సినిమా కూడా ఈ ఏడాది ఆస్కార్ లో నిలిచింది. ఈ మూవీలో పృథ్వీరాజ్(Prithviraj), సుకుమారన్(Sukumaran) హీరోలుగా నటించి ప్రేక్షకుల వద్ద మార్కులు కొట్టేశారు. ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్తాడు. కానీ అక్కడ గొర్రెల యజమాని చేతిలో బందీ అవుతాడు. ఉత్కంఠభరితంగా సాగే ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలాగే స్వాతంత్య వీర్ సావర్క్(Independence Veer Savark) మూవీ, ఆల్ విఇమాజిన్ యాజ్ లైట్(All vImagine as light), సంతోష్(Santosh), పుతుల్(Putul), గర్ల్స్ విల్ బీ గర్ట్స్(Girls Will Be Girls) అనే సినిమాలు కూడా 2025 బరిలో నిలవడం విశేషమని చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News