కర్మకు మెనూ లేదు నీకు అర్హత ఉన్నదే వడ్డిస్తుంది.. క్యూరియాసిటీ పెంచుతున్న ‘బూమరాంగ్’ ఫస్ట్ లుక్

యంగ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel) నాని ‘మజ్ను’(Majnu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2025-01-09 08:13 GMT

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel) నాని ‘మజ్ను’(Majnu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గోపీచంద్, అల్లు అర్జున్(Allu Arjun), పవన్ కల్యాణ్(Pawan Kalyan), రవితేజ(Ravi Teja) వంటి స్టార్స్‌తో నటించి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇక 2023లో ఈ అమ్మడు రావణాసుర, జపాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఓ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మూవీకి ఆండ్రీవ్ బాబు(Andreev Babu) దర్శకత్వం వహిస్తుండగా.. శివ కందుకూరి(Shiva Kandukuri) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే దీనిని బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్(Big Movie Makers Limited), మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై లండన్ గణేష్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఊట్ల(Praveen Reddy Ootla) నిర్మిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు ‘బూమరాంగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ అనూ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో చీకట్లో ఉన్న ఓ ఇంటి ముందు డెడ్‌బాడీలు కనిపిస్తుండగా.. ఓ వ్యక్తి వాటి మధ్యలో నుంచి కుక్కను పట్టుకుని వస్తున్నాడు. మరోవైపు అనూ తలపై రక్తం ఉండగా.. షాక్‌లో ఉన్నట్లు కనిపించింది. ఇక ఈ పోస్టర్‌కు ‘‘కర్మకు మెనూ లేదు.. మీకు అర్హత ఉన్నదే అందిస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక మొత్తానికి ఏడాది తర్వాత ఈ అమ్మడు ఓ సస్సెన్స్ స్టోరీతో రాబోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం అనూ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని(Curiosity) పెంచుతోంది.

Tags:    

Similar News