Nidhi Agarwal: హీరోయిన్ నిధి అగర్వాల్‌కు వేధింపులు.. అతనిపై కేసు పెట్టిన నటి

‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-01-09 08:15 GMT

దిశ, సినిమా: ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాతో పాటు, ప్రభాస్ సరసన ‘రాజా సాబ్’ మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను మంచి కోసం వాడే వారి కన్నా చెడుగా ఉపయోగించే వారే రోజు రోజుకి ఎక్కువైతున్నారు. అలాగే సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఆకతాయిల నుంచి వేధింపులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు కూడా ఇటువంటి వేధింపులు ఎదురయ్యాయి. దాంతో సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్‌లో కంప్లైట్ చేసింది ఈ బ్యూటీ.

ఇక కంప్లైంట్‌లో.. ఆ వ్యక్తి నన్ను చంపేస్తానని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాడని పేర్కొంది. అలాగే తనతో పాటు తనకు ఇష్టమైన వారిని, తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బెదిరింపులు పాల్పడుతున్నాడని, ఆ వ్యక్తి వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నాని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది నిధి అగర్వాల్. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ భామ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.

Tags:    

Similar News