harsha chemudu: బాధలో ఉన్నాను.. దయచేసి సాయం చేయండి అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమెడియన్

కమెడియన్ వైవా హర్ష(Viva Harsha) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

Update: 2025-01-08 15:24 GMT

దిశ, సినిమా: కమెడియన్ వైవా హర్ష(Viva Harsha) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు(Web series) చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియా(Social Media)లో పలు పోస్టులు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని పలు సినిమాల్లోనూ నటించాడు. తాజాగా, వైవా హర్ష నెటిజన్లను ఓ సాయం కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ వీడియో(Emotional video)ను షేర్ చేశాడు. ‘‘హాయ్ అందరికీ.. నేను మీ అందరిని ఒక సహాయం అడగడానికి ఈ వీడియో చేస్తున్నాను. మన చుట్టు పక్కల వాళ్లకు ఏదైనా సమస్య వస్తే ఒకలా ఉంటుంది, మన వరకు వస్తే అది వేరేలా ఉంటుంది.  నేను, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ బాధలో  ఉన్నాము. మా అంకుల్‌ ఏ. పాపరావు(A. Paparao).. ఆయన వయసు 91 ఏళ్లు ఆయనకి అల్జీమర్స్(Alzheimer's) కూడా ఉంది.

నాలుగు రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు. వైజాగ్‌(Vizag)లోని ఇంట్లోంచి ఆయన బయటకు వెళ్లారు. ఆయన్ను చివరి సారిగా కంచరపాలెం(Kancharapalem) ఏరియాలో..ఉన్నట్లు తెలిసింద. అదీ కూడా రెండు రోజుల క్రితం ఓ సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించారు. నా రిక్వెస్ట్‌ ఏంటి అంటే వైజాగ్‌లో ఉండే నా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌, స్టూడెంట్స్‌(Students) ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో.. కుదిరితే సర్చ్ గ్రూప్స్‌గా వెళ్లి అంకుల్‌ని వెతకడంలో సహాయం చేయండి. ఆయన కనిపిస్తే మొదట వెంటనే కాస్త ఫుడ్‌ ఇవ్వండి. ఆయన చాలా నీరసంగా కనిపిస్తున్నారు. వయసు 91 కాబట్టి చాలా బలహీనంగా ఉన్నారు. మీలో ఎవరికి కనిపించినా వీడియోలో ఇచ్చిన నెంబర్స్‌కి చెప్పండి’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వైవా హర్ష పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Full View


Read More ...

Hero Aditya Om Social Service నువ్వయ్యా రియల్ హీరో.!



Tags:    

Similar News