బర్త్‌డే స్పెషల్‌..‘టాక్సిక్’ గ్లింప్స్ వచ్చేసిందోచ్.. నయా లుక్‌లో ఆకట్టుకుంటున్న రాకీ భాయ్(వీడియో)

స్టార్ హీరో యశ్(Yash) ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) దర్శకత్వం వహిస్తుండగా.. కేవీఎన్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్(Monster Mind Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Update: 2025-01-08 06:10 GMT
బర్త్‌డే స్పెషల్‌..‘టాక్సిక్’ గ్లింప్స్ వచ్చేసిందోచ్..  నయా లుక్‌లో ఆకట్టుకుంటున్న రాకీ భాయ్(వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: స్టార్ హీరో యశ్(Yash) ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) దర్శకత్వం వహిస్తుండగా.. కేవీఎన్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్(Monster Mind Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘టాక్సిక్’(Toxic) నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ గ్లింప్స్‌ విడుదల చేస్తూ మూవీపై మరింత హైప్ పెంచేశారు.

ఇక విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. యష్ రెట్రో కారులో క్లబ్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు క్లబ్‌లో యూత్ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో యష్ ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌లో ఉన్న నీళ్లను ఆ మహిళపై పోశాడు. ఇంతటితో ఈ గ్లింప్స్ అయిపోతుంది. ఇక మేకింగ్ చూస్తుంటే రెట్రో స్టోరీలా అనిపిస్తోంది. ప్రస్తుతం విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.

Full View
Tags:    

Similar News