BRS: రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రైతు భరోసా(Raithu Bharosa) పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, కేసీఆర్(KCR) రైతు బంధు(Raithu Bandhu) అయితే.. రేవంత్(Revanth Reddy) రాబందువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) విమర్శించారు.
దిశ, వెబ్ డెస్క్: రైతు భరోసా(Raithu Bharosa) పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, కేసీఆర్(KCR) రైతు బంధు(Raithu Bandhu) అయితే.. రేవంత్(Revanth Reddy) రాబందువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) విమర్శించారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ రైతు భరోసా ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతులు రోడ్డెక్కి పోరాడితేనే ప్రభుత్వం దిగి వస్తుందని, రేపు రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రార్టీది ద్రోహం, నయవంచన అని, ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, రూ.12 వేలు ఇస్తాం పండగ చేసుకోమంటున్నారని అన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఇంత మోసం చేస్తుంటే.. రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రైతులను మోసం చేసినందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. కాంగ్రెస్ నాయకుల మానసిక పరిస్థితి బాగలేదని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయమంటే తప్పుడు కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడంలేదని, ఉన్న కంపెనీలు పోతున్నాయని ఆరోపించారు. అంతేగాక ఏడాదిలో రూ. లక్ష38 వేల కోట్ల అప్పులు తెచ్చారని, అప్పులు తెచ్చని డబ్బులు ఢిల్లీకి వెళ్తున్నాయా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.