Bhatti: పాఠశాలలో భట్టి ఆకస్మిక తనిఖీ.. చిన్నారులతో కలిసి మధ్యాహ్న భోజనం

బీబీనగర్ ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2025-01-05 10:38 GMT

దిశ, వెబ్ డెస్క్: బీబీనగర్ ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాదు(Hyderabad) నుంచి వరంగల్ (Warangal)వెళ్తున్న భట్టి.. మార్గమధ్యంలో బీబీనగర్(Bibinagar) లోని ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో(SC,BC Girls Residensial School) పర్యటించారు. ఈ సందర్భంగా.. విద్యార్థులకు అందుతున్న మెనూ, కాస్మోటిక్ ఛార్జీల వివరాలపై ఆరా తీశారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్(MLA Kumbham Anil Kumar) తో పాటు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

డైట్ చార్జీలు పెంచక ముందు, పెంచిన తర్వాత మెనూలో వచ్చిన మార్పులు.. నాణ్యత పాటిస్తున్నారా.. లేదా?, శుభ్రత ఎలా ఉంది అన్ని విషయాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్టోర్ రూమ్, తరగతి గదులను స్వయంగా తిరిగి పరిశీలించారు. అనంతరం విద్యార్థినులకు అందుతున్న వైద్య సహాయం.. వారి ఆరోగ్య వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు పరిశీలించారు. బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్న భట్టి.. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మన బిడ్డలు బాగుండాలని తెలిపారు. అలాగే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపారు.

Tags:    

Similar News