KTR : హైకోర్టు తీర్పుపై సుప్రీంకు కేటీఆర్
హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీ రావడంతో దానిపై న్యాయనిపుణులతో చర్చించిన కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే గనుక తమ వాదనను కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో గంటగంటకు పరిణామాలు మారుతున్న నేఫథ్యంలో ఏం జరగబోతున్నదనేది రాష్ట్ర రాజకీయాలను మరింత హాట్ హాట్ గా మారుస్తున్నాయి.