KTR: రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సర్కార్: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

రైతు రుణమాఫీ నుంచి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-22 08:04 GMT

దిశ, వెబ్‌డె‌స్క్: రైతు రుణమాఫీ నుంచి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేవెళ్లలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ యహంలో రియల్ ఎస్టేట్ ఆగమైతుందని అన్నారు. ఎన్నికల ముందుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఒక్క సంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. రుణమాఫీ అంటూ అనేక దేవుళ్లపై సీఎం రేవంత్ ఒట్టు పెట్టారని.. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా దైవ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. అసెంబ్లీలో గట్టిగా అడిగితే మమ్మల్యే తిరిగి దబాయించారని అన్నారు. నిండు సభలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కంటతడి పెట్టించారని ఫైర్ అయ్యారు. రుణమాఫీ, హమీలపై సమాధానం చెప్పే దమ్ము రేవంత్‌రెడ్డికి లేదని కేటీఆర్ విమర్శించారు.

Tags:    

Similar News