KTR: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలన పరిణామం.. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్?

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోంది.

Update: 2024-12-13 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోంది. ఫార్ములా ఈ-కార్ రేసు (Formula-E Car Race)లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR)ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ (ACB) సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి కూడా ఆమోదం లభించింది. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ (Hyderabad)‌ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు (Formula-E Car Race) నిధుల కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు పురపాలక శాఖ అధికారులతో పాటు అప్పట్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్‌‌‌పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి (Telangana Government) లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతినిస్తూ.. ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. దీనిపై న్యాయ సలహ స్వీకరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతిచ్చారు.   

Tags:    

Similar News