Twitter War: బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య ట్విట్టర్ వార్.. మరో నెటిజన్‌కు కేటీఆర్ కౌంటర్
బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య జరుగుతున్న ట్విట్టర్ యుద్ధంలో రాజకీయ నాయకులే కాదు, చాలా మంది విద్యావంతులు, పారిశ్రామిక వేత్తలు కూడా విమర్శలు చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య జరుగుతున్న ట్విట్టర్ యుద్ధంలో రాజకీయ నాయకులే కాదు, చాలా మంది విద్యావంతులు, పారిశ్రామిక వేత్తలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రం అయిన గుజరాత్‌కు చెందిన డాక్టర్ బకుల్ జెవదేకర్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలను ఛాలెంజింగా తీసుకున్న కేటీఆర్ 18 నెలల్లో పోషకాహార గణాంకాలలో అద్భుతమైన మార్పు చూస్తారని ఛాలెంజ్ చేశారు. దీనిపై స్పందించిన డాక్టర్ జెవదేకర్ 'ఈ ప్రశ్న మీరు ఇప్పటి వరకు ఏం చేశారో చూపించమని.. మీరు ఏమి చేస్తారో అని కాదు. మీ మాటల అర్థం వర్తమానంలో చూపించడానికి ఏమీ లేదని అంగీకారం! అంటూ సెటైర్లు వేశారు. దీంతో, కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. 'సార్, మీరు గుజరాత్‌కు చెందిన డాక్టర్ అని మీ బయోలో ఉంది. దయచేసి మీరు వ్యాఖ్యానించే ముందు ఓసారి ఆలోచించండి. 27 ఏళ్లు బీజేపీకి అధికారం ఇచ్చిన మోడీ సొంత రాష్ట్రం కంటే 8 ఏళ్లలోపు తెలంగాణ చాలా మెరుగ్గా ఉంది. ఎన్‌హెచ్ఎస్ సర్వేలో ఓసారి చూసి మీరే అవగాహన చేసుకోండి' అంటూ కౌంటర్ ఇచ్చారు.
Also Read : మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలి.. కోదండరాం డిమాండ్