రాజేంద్రప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరామర్శించారు.
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూకట్ పల్లిలోని వారి నివాసానికి వెళ్ళి ఆయనను ఓదార్చారు. గాయత్రి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. చిన్నవయసులోనే గాయత్రి చనిపోవడం బాధాకరమైన విషయం అని, నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొనడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు.