కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు గైర్హాజరు

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీకి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరుకాకపోవడంతో తిరిగి సమావేశం ఈ నెల 12కు వాయిదా పడింది.

Update: 2024-04-04 16:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీకి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరుకాకపోవడంతో తిరిగి సమావేశం ఈ నెల 12కు వాయిదా పడింది. ఈ మేరకు తదుపరి సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు హాజరుకావాలంటూ కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే కోరారు. ఈ సమావేశంలో ముఖ్యంగా శ్రీశైలం, సాగర్‌ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వ, రెండు రాష్ట్రాల్లో భవిష్యత్‌లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడంపై కమిటీ చర్చించనుంది. తన వాటా కంటే తెలంగాణ 7 టీఎంసీలకు పైగా అదనంగా వాడుకుందని బోర్డు తెలిపింది. ఈ నెల 8 నుంచి సాగర్‌ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఏపీ కోరింది. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 5 టీఎంసీలు విడుదల చేయనుంది.

Tags:    

Similar News