భారతదేశాన్ని 'విశ్వగురువు'గా మార్చేందుకు కృషి చేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారతరత్న మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 100వ జయంతి వేడుకలు తెలంగాణ బీజేపీ(BJP) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Update: 2024-12-25 15:19 GMT

దిశ, వెబ్ డెస్క్: భారతరత్న మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 100వ జయంతి వేడుకలు తెలంగాణ బీజేపీ(BJP) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి తెలంగాణ బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అనంతరం బీజేపీ ఆఫీస్ లో పలువురు అతిధుల సారధ్యంలో అటల్ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మీడియాతో మాట్లాడుతూ.. మేము దేశవ్యాప్తంగా భారత రత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతిని ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో సుపరి పాలన అందించేందుకు మేము కట్టుబడి పని చేస్తున్నామన్నారు. అలాగే పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ప్రయోజనం అందిస్తున్నామని, వాల్మీకి అంబేద్కర్ ఆశ్రమ యోజన (VAMBAY)ను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించారని.. ఈ యోజన కింద మేము నాలుగు లక్షల ఇళ్లు నిర్మించామని గుర్తు చేశారు. అలాగే బీజేపీ ప్రభుత్వం భారత్‌ను 'విశ్వగురు'గా మార్చడానికి నిరంతరం పని చేస్తున్నామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.


Similar News