'గ్రీన్ సిగ్నల్'లు కాదు.. నోటిఫికేషన్లు ఇవ్వండి: K Rajagopal Reddy
దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల భర్తీ విషయంలో కాలయాపన చేస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వంపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే
దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల భర్తీ విషయంలో కాలయాపన చేస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వంపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి ఉద్యోగాల నోటిఫికేషన్ల సంగతి గుర్తుకు వస్తోందని, ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ 2,910 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో గ్రూప్ -2కు 663, గ్రూప్-3 కు 1,373 పోస్టులకు ఆమోదం తెలిపింది. త్వరలో మిగతా కొలువుల భర్తీ చేపడతామని ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంపై గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. 'ఇంకా ఎన్ని రోజులు ఇలా "గ్రీన్ సిగ్నల్" అంటూ కాలం వెల్లదీస్తారు. హూజరాబాద్ ఉప ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు అన్నారు. అందులో ఎన్ని భర్తీ చేశారు?' అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు మభ్యపెట్టడం ఆ తర్వాత కూలి హమాలీ పనులు చేసుకోండి అని అహంకారపు మాటలు మాట్లాడటం అంతా ప్రభుత్వానికి మామూలైపోయింది అంటూ మండిపడ్డారు.
Also Read : టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్..అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఇదే..!
Also Read : ప్రధాని ప్రసంగంపై కాదు బడులపై దృష్టి పెట్టండి.. కేటీఆర్‌కు డీకే అరుణ కౌంటర్..