'మిమ్మల్ని కాదు మమ్మల్ని అంటారు'.. ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆర్ అండ్ బీ శాఖ రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Update: 2024-06-19 09:08 GMT
మిమ్మల్ని కాదు మమ్మల్ని అంటారు..  ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో అత్యంత ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందుండటం బాధాకరం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్ల నిర్మాణం తప్పనిసరి అన్నారు. బుధవారం సచివాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, బ్లాక్ స్పాట్ల రిపేర్లపై చర్చించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న ఆసుపత్రుల భవనాల నిర్మాణాలపై ఆరా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను 24 గంటలు మీకు అదుబాటులో ఉంటానని, రోడ్లు బాగోలేక ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడవద్దని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రోడ్లను అందించడమే మన లక్ష్యం కావాలని చెప్పారు. ఏ ప్రభుత్వమైన విజయవంతం కావాలంటే అధికారుల మద్దతు అవసరమన్నారు. రోడ్లు చెడిపోతే ఆ బాధ్యత కాంట్రాక్టర్లతో పాటు అధికారులకూ ఉంటుందన్నారు. రోడ్డు బాగలేకపోతే ప్రజలు కాంట్రాక్టర్లను, అధికారులను ఏమి అనరు, కానీ ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తారన్నారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వమని అయితే ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల జీవితాలు ప్రభావితం అయితే అలాంటి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆర్ఆర్ఆర్ తో అభివృద్ధి మరింత వేగవంతం:

ఓఆర్ఆర్ వల్ల హైదరబాద్ కు వచ్చిన పెట్టుబడుల కంటే మిమ్మల్ని కాదు మమ్మల్ని అంటారు.. అధికారులతో మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆర్ఆర్ఆర్ వల్ల రెట్టింపు పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరుగబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు త్రిబుల్ ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ యుటిలిటీ ఛార్జీల చెల్లింకపోవడం వల్ల పనులు ఆగిపోయాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని కలిసి యుటిలిటీ ఛార్జీలను కడతామని చెప్పడంతో పనులకు ఆమోదం లభించిందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా చేయాలన్నారు. ఎన్ హెచ్-65 ని గ్రీన్ ఫీల్డ్ హైవే గా నిర్మాణం కోసం ముందుకు వెళ్తున్నామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు యేండ్లుగా నత్తనడకన సాగడంపై అధికారులను మంత్రి ప్రశ్నించారు. అంబర్ పేట్ ప్లైఓర్ పనులు పూర్తిగా కాబోతున్నాయని మరో నెల రోజుల్లో ట్రాఫిక్ కు అనుమతిస్తాని ఈఎన్సీ మంత్రికి వివరించారు.రు.

Tags:    

Similar News