తీవ్ర వివాదంలో కోదాడ ఆర్డీఓ.. జాతీయ గీతాలాపన ఆపేసి ఫోన్‌లో...

జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఓ ఉన్నతాధికారి వ్యవహరించిన తీరు తీవ్ర వివాదస్పదం అవుతోంది.

Update: 2024-08-15 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఓ ఉన్నతాధికారి వ్యవహరించిన తీరు తీవ్ర వివాదస్పదం అవుతోంది.బాధ్యత గల ఆఫీసర్ జాతీయ గీతాలాపన ఆపేసి ఫోన్ చూసుకోవడం సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం.. ఆగస్ట్ 15 సందర్భంగా కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా.. అధికారులు, ప్రజాపత్రినిధులు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. స్థానిక ఆర్డీవో సూర్యనారాయణ సైతం సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు ఫోన్ రావడంతో వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించడం మధ్యలో ఆపేసిన ఫోన్ చూసుకుంటూ నిలబడ్డారు. దీనిని గమనించిన పలువురు జాతీయ గీతం వస్తుంటే ఎంతటి వారైనా ఆగి గౌరవంగా ఆలపిస్తారని కానీ, కోదాడ ఆర్డీవో మాత్రం సెల్ ఫోన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివిజల్ అధికారి అయ్యుండి జాతీయ గీతాన్ని అవమానపరచడం తగదని మండిపడుతున్నారు.  


Similar News