ఖైరతాబాద్ బడా గణేశ్‌ను చూడ్డానికి వెళ్తున్నారా?.. ముందు ఇది తెలుసుకోండి!

రేపే వినాయక చవితి. ఈ సందర్భంగా ప్రజెంట్ ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది.

Update: 2024-09-06 13:28 GMT

దిశ,వెబ్‌డెస్క్:రేపే వినాయక చవితి(Lord Vinayaka). ఈ సందర్భంగా ప్రజెంట్ ఎక్కడ చూసినా పండుగ వాతావరణం(Festive atmosphere) నెలకొంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్(Khairatabad) బడా గణేష్ తొలి పూజకు ముస్తాబు అవుతున్నాడు. ఇక నగరవాసులకు ఖైరతాబాద్ గణపయ్యను ఎప్పుడెప్పుడు చూడాలని, దర్శించుకోవాలని ఉత్సుకతతో ఉంటారు. ఈ క్రమంలో బడా గణేష్‌ను చూడ్డానికి వెళుతుంటారు. అయితే ఖైరతాబాద్ బడా వినాయకుడిని చూడటానికి వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి. అవి ఏంటంటే..శనివారం(సెప్టెంబర్ 7వ తేదీన) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), గవర్నర్ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోనున్నారు.

ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు(heavy traffic) ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులకు(passengers) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనాలను ఇతర మార్గాల వైపు దారి మళ్లించారు. బందోబస్తుకు మూడు షిఫ్టుల్లో 400 మంది పోలీసులు పనిచేస్తారని ట్రాఫిక్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ క్రమంలో వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం, వీకెండ్ కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి రోజునే రాష్ట్ర సీఎంతో పాటు గవర్నర్ పూజలకు రానుండడంతో 24 గంటల పాటు పోలీసులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. భారీ గణపతి(Huge Ganapati) వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్పీలు, 13మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది ఉంటారని చెప్పారు.


Similar News