Kishan Reddy: సీఎం మారారు తప్ప.. రాష్ట్రంలో ఇంకేం మారలే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
రాష్రానికి సీఎం మారారే తప్ప.. ఇంకేం మారలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యా్ఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్రానికి సీఎం మారారే తప్ప.. ఇంకేం మారలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యా్ఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సంగారెడ్డి జిల్లా (Sanga Reddy District)లోని కంది (Kandi)లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ (Congress) పాలనపై అప్పుడే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కామెంట్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎక్కడపడితే అక్కడ అధికార పార్టీ నేతలను యువత, మహిళలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. తెలంగాణ (Telangana)లో ప్రభుత్వం మారిందే తప్పా.. పాలన ఏమాత్రం మారలేదని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో దోపిడీ, దుర్మార్గ పాలన కొనసాగుతోందని అన్నారు. గడిచిన పదేళ్లలో శాసన మండలి (Legislative Council) పూర్తిగా నిర్వీర్యమైందని ధ్వజమెత్తారు. మండలిలో ప్రజల గొంతుక వినిపించేది ఒక్క బీజేపీయేనని అన్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే.. ప్రతిపక్షంగా మండలిలో వ్యవహరిస్తామని మాటిచ్చారు. బీఆర్ఎస్ (BRS) దోపిడీ నుంచి ప్రజలు మార్పు కొరుకున్నారని.. కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు వాళ్లకు ఓట్లు వేశారని అన్నారు. అనంతరం అధికారంలో వచ్చాక ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సక్రమంగా నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) పాలనపై పదేళ్లకు వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్‌పై ఏడాదికే వ్యతిరేకత వచ్చిందంటే వారి పాలన ఎలా ఉందో అర్థం అవుతోందని కిషన్ రెడ్డి అన్నారు.