భద్రాద్రి రామయ్యకు యూట్యూబ్ ఛానల్.. పేరేంటో తెలుసా?

భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో భద్రాద్రి రాములవారి యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించినట్లు ఈఓ రమాదేవి తెలిపారు.

Update: 2024-10-16 04:03 GMT

దిశ, వెబ్ డెస్క్: యూ ట్యూబ్ ఛానల్.. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఇది ఉంటోంది. కొత్తగా ఏం చేయనక్కర్లేదు. డైలీ రొటీన్, వంటలు వంటి సింపుల్ వీడియోస్ పోస్ట్ చేసి కూడా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్ కం పొందుతున్నారు యూజర్లు. ఇప్పుడు మన భద్రాద్రి రామయ్య పేరిట కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసింది ఆలయ కమిటీ. ఈ విషయాన్ని ఈఓ రమాదేవి వెల్లడించారు. భద్రాద్రి దివ్యక్షేత్రం (Bhadradri Divya Kshetram) అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారామె. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ఆలయంలో రోజువారీ క్రతువుల గురించి తెలిపేలా ఈ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్ట్ చేయనున్నట్లు తెలిపారు.

ట్రయల్ రన్ గా ఒక వీడియోను కూడా అప్ లోడ్ చేశారు. ఆ వీడియోలా తెలుగు రాష్ట్రాల్లో రాములవారికి ఉన్న భూముల వివరాలు, బంగారం, వెండి ఆభరణాల వివరాలను పేర్కొన్నారు. 1300 ఎకరాల భూమి, 68 కిలోల బంగారం, 980 కిలోల వెండి ఉన్నాయని 20 నిమిషాల నిడివితో తయారు చేసిన వీడియోను.. త్వరలోనే అప్ లోడ్ చేయనున్నారు. అలాగే ఉత్సవాలకు సంబంధించిన వీడియోలను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తామని రమాదేవి వివరించారు. 


Similar News