రాష్ట్రస్థాయి ఈత పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
డిసెంబర్ 7, 8 తేదీల్లో భూపాలపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఉమ్మడి జిల్లాల ఆక్వాటిక్ & స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ హనుమంత రాజు ఆదివారం తెలిపారు.
దిశ, కొత్తగూడెం : డిసెంబర్ 7, 8 తేదీల్లో భూపాలపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఉమ్మడి జిల్లాల ఆక్వాటిక్ & స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ హనుమంత రాజు ఆదివారం తెలిపారు. భూపాలపల్లిలోని సింగరేణి స్విమ్మింగ్ పూల్ లో జరగనున్న ఈ పోటీలకు కొత్తగూడెం సీఈఆర్ క్లబ్ స్విమ్మింగ్ పూల్ లో ఆదివారం ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుండి వివిధ విభాగాల్లో క్రీడాకారులు ఎంపికయ్యారు.
గ్రూప్ వన్ నుండి కె. పవన్, బి.రామ్ సందేశ్, కె.సాయి శ్రీ వాత్సవ్, గ్రూప్ 2 నుండి ఎస్.చత్రపతి నాథ్, కె.కేశవ, ఐ. భగవత్, డి.ఆశిష్ విస్లాన్, గ్రూప్ 3 నుండి సీహెచ్. మోక్ష చంద్రశేఖర రావు, జి. మాన్విక్, ఆర్. జస్వంత్ సాయి సాత్విక్, గ్రూప్ 4 హసన్ చౌదరి కెవిన్ విల్సన్, శ్రీకాంత్, బాలికల నుండి గ్రూప్ 3 ఎస్. గాయత్రి, సీహెచ్. రక్షిత, గ్రూప్ 5 అమన ప్రియ, ఏకస్వీ లు ఎంపికైనట్లు హనుమంత రాజు తెలిపారు. రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, పోస్నెట్, నరహరి, కోచ్ లు శామ్యూల్, రాంబాబు సంధ్య, సామంత్ లు అభినందించారు.