ప్రజాపాలనలో సమస్యలకు పరిష్కారం
ప్రజాపాలనలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు.
దిశ, అశ్వారావుపేట : ప్రజాపాలనలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మండల కేంద్రంలో పేరాయిగూడెం గ్రామపంచాయతీలో ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేకంగా చేపట్టిన హలో శుభోదయం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం వీధుల్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, నాయకులతో చర్చించారు. పలువురు డ్రైనేజీ, సీసీ రోడ్లను మంజూరు చేయాలంటూ ఎమ్మెల్యే జారెని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో నిధులు సమీకరించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చేసి చూపుతానన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత జూపల్లి రమేష్ బాబు, నార్లపాటి రాములు, ఎస్కే పాషా, మిండా హరిబాబు, జూపల్లి ప్రమోద్, కోసూరి రాజు, తుమ్మా రాంబాబు తదితరులు ఉన్నారు.