మీ ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష
ప్రజల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష అని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు.
దిశ, మధిర : ప్రజల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష అని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆత్కూర్ గ్రామ సమీపంలోని కటికల కృష్ణారెడ్డి మామిడి తోటలో రెడ్డి వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మన రాష్ట్రాన్ని మన జిల్లాని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఏ అవసరం వచ్చినా తన వద్దకు రావచ్చని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉన్నానన్నారు. అనంతరం ఆత్కూరు గ్రామానికి చెందిన అంకె వేలాద్రి ఇటీవల అనారోగ్యానికి గురై బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకోవడంతో ఆయన నివాసానికి వెళ్లి పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు.
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. అంతకు ముందు రెడ్డి సంఘం , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, కోటా రాంబాబు, భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, విద్యాలత యన్నం కోటేశ్వరరావు, కటికల సీతారామిరెడ్డి, దేవి శెట్టి రంగారావు, టీవీ రెడ్డి అమరవాది, సత్యనారాయణరెడ్డి, వేమిరెడ్డి త్రివేణి ఘన స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు నివాసంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురామిరెడ్డి తేనేటి విందులో పాల్గొన్నారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మంత్రి, ఎంపీని ఘనంగా సన్మానించారు.