తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

Update: 2024-06-28 09:20 GMT

దిశ,నేలకొండపల్లి : తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు నెలలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలు తీసుకుని ఖమ్మం, కోదాడ జాతీయ రహదారిని దిగ్బంధించారు. అధికారులు డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఖమ్మం, కోదాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత కొన్ని

     నెలలుగా తాగునీరు సరఫరా చేయకపోతే తాము ఎలా జీవించాలంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీరు ఏమాత్రం సరిపోవడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు ఆ పైపులు కూడా పగిలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని నిరసన చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ ని పునరుద్ధరించారు.

Similar News