దిశ ఎఫెక్ట్.. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు గేట్లు నిర్మాణం..

అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ని ప్రభుత్వం రెండేళ్ల నుంచి నిరుపయోగంగా వదిలేసిందని అంశం పై ఇటీవల దిశ పత్రికలో కథనం వెలువడింది.

Update: 2024-07-01 10:21 GMT

దిశ, కొత్తగూడెం : అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ని ప్రభుత్వం రెండేళ్ల నుంచి నిరుపయోగంగా వదిలేసిందని అంశం పై ఇటీవల దిశ పత్రికలో కథనం వెలువడింది. కనీసం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కి గేట్లు కూడా లేకపోవడంతో చీకటి పడగానే మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారేది. కమ్యూనిటీ హాల్లో ఉన్న పలు సమస్యల పై జూన్ 8వ తేదీన దిశ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికారుల్లో కదలిక వచ్చి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు రెండు వైపులా గేట్లను అమర్చారు. మరమ్మతులను కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

Similar News