విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లా పోలీస్ శాఖ సిద్ధం

వర్షాకాలంలో జిల్లాలోని నదులు, వాగులు, వంకలు పొంగి వరదలు వచ్చే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు జిల్లా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున "డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్" సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

Update: 2024-07-03 13:14 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : వర్షాకాలంలో జిల్లాలోని నదులు, వాగులు, వంకలు పొంగి వరదలు వచ్చే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు జిల్లా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున "డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్" సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమలయమై అక్కడ నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం అందితే వెంటనే డీడీఆర్ఎఫ్ బృందం

    అక్కడికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని కాపాడే విధంగా బృందంలోని సభ్యులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం అందిస్తే వెంటనే డీడీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పరితోష్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్, రవి, లాల్ బాబు, సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Similar News