బొగ్గు బ్లాక్ ల వేలం ఆపాలి

సత్తుపల్లి పట్టణంతోపాటు వేంసూరు, పెనుబల్లి ,కల్లూరు, తల్లాడ, మండల కేంద్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిప్రతం అందించారు.

Update: 2024-07-03 15:28 GMT

దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంతోపాటు వేంసూరు, పెనుబల్లి ,కల్లూరు, తల్లాడ, మండల కేంద్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిప్రతం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గుబ్లాకులు వేలం వేయటానికి ప్రయత్నిస్తుందని, దాన్ని వెంటనే ఆపాలని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సింగరేణికి అప్పగించాలని కోరారు.

    అదేవిధంగా సత్తుపల్లి పట్టణంలో వేలాది మంది పేదలకు ఇళ్లు ,ఇళ్ల స్థలాలు లేవని తెలిపారు. సత్తుపల్లితో పాటు వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడలో అమలు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులు గత తొమ్మిది నెలలుగా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారని, జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వారి బిల్లులు జీతాలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, జీతం 10,000 కు పెంచాలని కోరారు.

    ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి తప్పకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సత్తుపల్లి మండల కార్యదర్శి తడికమళ్ల యోబు, వేంసూర్ కార్యదర్శి లాల్ మహమ్మద్,షేక్ రంజాన్, బి.నాగ వెంకటేశ్వరరావు, శివ, నాగమణి, యువజన సంఘం నాయకులు హామీద్ ,అజయ్ పాల్గొన్నారు.


Similar News