కాంగ్రెస్ వి 420 హామీలు

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అలవి కాని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆరోపించారు.

Update: 2024-07-03 13:18 GMT

దిశ, భద్రాచలం /దుమ్ముగూడెం : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అలవి కాని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆరోపించారు. బుధవారం దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామంలో జరిగిన భద్రాచలం నియోజకవర్గం స్థాయి బీఆర్ ఎస్ పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని, సమిష్టి కృషితో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు.

     రెండు పార్లమెంట్ సీట్ల తో దేశంలోని అన్ని పార్టీలను ఐక్యం చేసి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ దని, తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. ఆరు గ్యారెంటీ లు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 8నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. రైతుబంధు ఇప్పటివరకు అడ్రెస్ లేదని, రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణపేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు.

    కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలపక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, గుడవర్తి నర్సింహమూర్తి, దొడ్డి తాతారావు, పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి, గంపా రాజంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు, పార్టీ నాయకులు తుమ్మలపల్లి దనేశ్వరావు, ఎంపీపీ రేసు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


Similar News