మధిరలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా..

మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని, మధిరను మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2024-07-01 10:16 GMT

దిశ, మధిర : మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని, మధిరను మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానం మౌలిక వసతులతో కూడిన పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. మధిరకు త్వరలోనే ఐటీ హబ్ వస్తుందని, ఏర్పాటుకు కావలసిన భూమిని గుర్తించామన్నారు. మధిర మండల పరిధిలోని సిరిపురం గ్రామ సమీపంలోనే ఎండ్రపల్లి గుట్టల వద్ద ఎంఎస్ఎమ్ఈ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు.

ఈ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా యువత పారిశ్రామికంగా ఎదుగుదలకు దోహద పడతాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యం కలిగిన యువకులు ముందుకు వచ్చి ఎంఎస్ఎంఇ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి వారికి రాయితీలు ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ట్రెడిషనల్ వ్యాపారాన్ని పారిశ్రామికరణ చేసి ఉత్పత్తి వినియోగం పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదలకు ఇందిరా డైరీని నెలకొల్పుతామన్నారు. ఈ డైరీ ద్వారా సమాజంలో మహిళలు మహారాణులుగా చూడాలన్నదే నా కోరిక అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కొరకు ఈ ఇందిరా డైరీ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఇందిరా డైరీ ద్వారా మహిళలు యువకులు ఆర్థికంగా ఉపాధి పొందటమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వారు అవుతామన్నారు.

Similar News