ఎమ్మెల్యేని అవమానిస్తారా ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన అనుచరులు హెచ్చరించారు.

Update: 2024-06-28 14:07 GMT

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన అనుచరులు హెచ్చరించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారని, ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయిల్ ఫెడ్ అధికారులు ఎమ్మెల్యే జారె కు ప్రాధాన్యత ఇవ్వకుండా సాధారణ వ్యక్తి లాగా కూర్చోబెట్టారని ఆయన అనుచరులు ఖండించారు. గౌరవ శాసనసభ్యుడిని సామాన్యుడిలాగా పరిగణించడం

    ఆయిల్ ఫెడ్ అధికారులకు సబబు కాదని అభ్యంతర వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు ప్రత్యేక కుర్చీ కేటాయించకుండా అగౌర పరచడం బాధ కలిగిస్తుందని, ఎమ్మెల్యే జారె పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదన్నారు. అతి మంచితనం కూడా ప్రమాదమేనని తమ నాయకుడు జారె వ్యవహార శైలిని ఉద్దేశిస్తూ మరో అనుచరుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆయిల్ ఫెడ్ అధికారులు మంత్రి సేవలో పూర్తిగా నిమగ్నమవ్వడమే ఇందుకు కారణమైనట్లుగా చెప్పుకుంటున్నారు.

Similar News