'మణిపూర్ అల్లర్లపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదు?'.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనీ ఫైర్

మణిపూర్ మహిళలపై రోజురోజుకి దాడులు పెరుగుతున్న రాష్ట్రమంతా అల్లర్లు పెరిగి, వల్లకాడు అవుతున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కుణంనేని సాంబశివరావు ఘాటుగా ప్రశ్నించారు.

Update: 2023-08-06 12:52 GMT

దిశ, మణుగూరు: మణిపూర్ మహిళలపై రోజురోజుకి దాడులు పెరుగుతున్న రాష్ట్రమంతా అల్లర్లు పెరిగి, వల్లకాడు అవుతున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కుణంనేని సాంబశివరావు ఘాటుగా ప్రశ్నించారు. ఆదివారం మండలంలోని సీపీఐ కార్యాలయంలో నాయకుడు కమటం వెంకన్న అధ్యక్షతన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి కూనంనేనీ సాంబశివరావు హాజరై మాట్లాడుతూ.. మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై దాడులు, అల్లర్లు, విధ్వంసం జరుగుతుంటే కేంద్రం వాటిని నిరోధించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు.

అక్కడ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. దోషులను ఎందుకు శిక్షించలేదని మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి కొందరు వీటిని ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దోషుల వలన మానవత్వం మంటగలుగుతుందని వెంటనే సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, మరెన్నడు ఇలాంటి అల్లర్లు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలనీ డిమాండ్ చేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన వాగులు, వంకలు, చెరువులు తెగి గోదావరి పెరిగి ఇల్లు నీట మునిగి అనేకమంది నిరాశ్రయులయ్యారని గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని బాధితులందరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే ప్రజల ఆరోగ్యాల కోసం నిరంతరం పనిచేసే పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ కనీస వేతన చట్టం అమలు చేయాలని వారి డిమాండ్స్ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి డిమాండ్స్ పరిష్కారం కొరకు వారితో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీ. అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, ముత్యాల విశ్వనాథం, రేసు ఎల్లయ్య, సలిగంటి శ్రీను, శ్రీనివాస్ రెడ్డి మున్నా లక్ష్మీకుమారి, శంకర్, నరేందర్, ఎండి సలీం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News