అథ్లెటిక్స్ లో మెరిసిన గురుకుల బాలిక

భద్రాచలం గిరిజన గురుకుల బాలికలు చదువులోనే కాదు ఆటల్లో కూడా ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.

Update: 2024-10-18 16:00 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం గిరిజన గురుకుల బాలికలు చదువులోనే కాదు ఆటల్లో కూడా ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో గత రెండు రోజులుగా జరుగుతున్న 35వ సౌత్ జోన్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ పోటీల్లో భద్రాచలం గిరిజన గురుకుల కళాశాలలో హెచ్ఈసీ గ్రూప్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న టి.శ్రీతేజ 4,663 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

    100 మీటర్ల హార్డిల్, హైజంప్, షాట్ పుట్, 200 మీటర్ల రన్, లాంగ్ జంప్, జావలిన్ త్రో తదితర 7 ఈవెంట్లలో ఈ విద్యార్థిని రాణించి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపాల్ ఏ.పద్మావతి, స్టాఫ్ అభినందించారు. వారు మాట్లాడుతూ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, ఆర్సీఓ కె. నాగార్జున రావు, గిరిజన గురుకుల సొసైటీ అధికారుల పర్యవేక్షణ, ప్రోత్సాహం, కళాశాల పీడీ తర్ఫీదుతో గురుకులం బాలిక క్రీడల్లో రాణించడం సంతోషకరంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా శ్రీతేజ రాణించాలని ఆకాంక్షించారు.  

Tags:    

Similar News