పోలీస్ శాఖపై విశ్వసనీయత పెంచాలి
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకుంటూ పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు.
దిశ,టేకులపల్లి : నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకుంటూ పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్ సందర్శనకు విచ్చేసిన ఎస్పీ రోహిత్ రాజ్ కు ఇల్లందు డీఎస్పీ ఎన్. చంద్రభాను పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఎస్పీ రోహిత్ రాజ్ కు టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది గౌరవ వందనం చేశారు.
అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ లో ఉన్న లాకప్ రూమ్, సందర్శకుల విశ్రాంతి ప్రదేశం, సిబ్బంది బైక్ స్టాండ్ ను, పోలీస్ వాహనాల పార్కింగ్ ప్రదేశంను పరిశీలించడంతోపాటు రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ వద్ద బస్ షెల్టర్ ఓపెనింగ్ చేశారు. టేకులపల్లి బోడురోడ్ కూడలి, ముత్యాలంపాడు కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దిన టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై పోగుల సురేష్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ ఎన్. చంద్రబాను, సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై పోగుల సురేష్, బోడు ఎస్సై పి.శ్రీకాంత్, ఆళ్లపల్లి ఎస్సై రితీష్ పాల్గొన్నారు.