కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను మోసం చేశాడు : భట్టి విక్రమార్క

మండల పరిధిలోని మోటమర్రి, రాయన్న పేట, ఆళ్పపాడు, గోవిందాపురం ఏ గ్రామాల్లో మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Update: 2023-11-13 15:59 GMT

దిశ, బోనకల్ : మండల పరిధిలోని మోటమర్రి, రాయన్న పేట, ఆళ్పపాడు, గోవిందాపురం ఏ గ్రామాల్లో మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో భట్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని అనడానికి కేసీఆర్, కేటీఆర్ కు బుద్ధుండాలి. కాంగ్రెస్ హామీల అమలుకు నిధులు లేకుంటే.. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి. ఎవరిని మోసం చేస్తారు ? ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసింది. ప్రజలను మోసం చేయడం బీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య, కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది.. చెప్తుందె చేస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి పాలకుల దోపిడి అరికడితే చాలు. పరిపాలన అనుభవం కలిగిన మాకు ఆరు గ్యారంటీ అమలకు నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలుసునన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లుఇస్తానని 10 ఏళ్లుగా ఇందిరమ్మ ఇల్లు కూడా రాకుండా చేసిన కేసీఆర్ దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యన జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు గెలవాలన్నారు. ప్రజల సంపద ప్రజలకు పంచబడాలన్నారు. బోనకల్ మండలంలో మూలకు విసిరేసి పడి ఉన్నట్టుగా మోటమర్రి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్డు వేశాం. మోటమర్రి గ్రామము నుంచి మధిర వరకు ఉన్న రోడ్డును విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోవిందపురం నుంచి మోటమర్రి వరకు ఉన్న డొంక రోడ్డును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో బీటీ రోడ్డుగా మారుస్తానన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందాలని భావించే ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావడానికి చేయ్యి గుర్తుపై ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు, పైడిపల్లి కిషోర్, గాలి దుర్గారావు, కర్ణాటి రామకోటేశ్వరరావు, పిల్లల మరి నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి సుబ్బారావు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Tags:    

Similar News