సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న గ్రామాలు

నేరాలను అదుపుచేసేందుకు మండల ప్రజలు,పోలీసులు నడుంభిగించారు.

Update: 2025-03-14 15:46 GMT
సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న గ్రామాలు
  • whatsapp icon

దిశ,నేలకొండపల్లి: నేరాలను అదుపుచేసేందుకు మండల ప్రజలు,పోలీసులు నడుంభిగించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో.. ఏర్పాటు చేస్తున్న నిఘానేత్రాలు నేరాలకు అడ్డుకట్టవేయడానికి దోహదపడుతున్నాయి. సీసీకెమెరాల ఏర్పాటుతో దొంగతనాలు, నేరాలు చేయడానికి దొంగలు భయపడుతున్నారు. మండలంలో పోలీసులు అవగాహన కల్పించడం వల్ల చెరువు మధారం,బుద్దారం,కొంగర, మండ్రాజుపల్లి, రాయిగూడెం, అమ్మగూడెం గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు.

పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీకెమెరాల ఏర్పాటుకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వాటి ఉపయోగాలు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో అసాంఘీక కార్యకలాపాల నియంత్రణ, యువత చెడు వ్యసనాలకు గురికాకుండా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి ఎస్ ఐ సంతోష్, ఆరికట్ల గురవయ్య, అచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.


Similar News