సబ్ జైలర్, ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్
సత్తుపల్లి సబ్ జైల్లో విచారణ ఎదుర్కొంటున్న రిమాండ్ ఖైదీ ఈనెల 11వ తేదీన సబ్ జైలు నుంచి పరారైన ఘటన చోటు చేసుకుంది.

దిశ,సత్తుపల్లి: సత్తుపల్లి సబ్ జైల్లో విచారణ ఎదుర్కొంటున్న రిమాండ్ ఖైదీ ఈనెల 11వ తేదీన సబ్ జైలు నుంచి పరారైన ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన పెండ్ర రమేష్ పారిపోయిన రోజే మధ్యాహ్నం ఏపీలోని ఎర్రగుంట పాడు, గోపాలపురం గ్రామంలో పట్టుబడిన సంఘటన పాఠకులకు విధేయతమే. ఈ సంఘటనపై 11 వ తేదీ జిల్లా సబ్ జైల్ అధికారి జె.వెంకటేశ్వర్లు పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరుసటి రోజు వరంగల్ రేంజ్ డీఐజీ ఎం సంపత్ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఉన్నత అధికారులు సత్తుపల్లి సబ్ జైలర్, ఇద్దరు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం డిప్యూటీ జైలర్ గా పని చేస్తున్న కుటుంబరావు బాధ్యతలు స్వీకరించారు.