ఏకులపోతమ్మ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామంలో ఉన్న ఏకుల పోతమ్మ అమ్మవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.

దిశ ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామంలో ఉన్న ఏకుల పోతమ్మ అమ్మవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏకుల పోతమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ సందర్భంగా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన వారికి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వాసం రాణి, దొడ్డ భాస్కర్, కేవీ సత్యనారాయణ, కొయ్యల అచ్యుతరావు, చిన్నశెట్టి యుగంధర్, సాయిల నరసింహారావు, పర్వతనేని ప్రసాద్, దొడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.