ఎలక్ట్రిక్ కుక్కర్ వాడకంపై కొండరెడ్లకు కలెక్టర్ అవగాహన
ఎలక్ట్రిక్ కుక్కర్ వాడకంపై గుత్తికోయలకు జిల్లా కలెక్టర్ జీతిష్ వి పాటిల్ అవగాహన కల్పించారు.
దిశ, దమ్మపేట:- ఎలక్ట్రిక్ కుక్కర్ వాడకంపై గుత్తికోయలకు జిల్లా కలెక్టర్ జీతిష్ వి పాటిల్ అవగాహన కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దట్టమైన అటవీలోని గ్రామమైన పూసుకుంటలో శనివారం రాత్రి జితేష్ వి పాటిల్ మండల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పూసుకుంట గ్రామంలో నివసిస్తున్న గుత్తికోయలకు ఎలక్ట్రిక్ కుక్కర్ వాడకంపై అంగన్వాడీ కేంద్రం వద్దకు గ్రామస్తులందరినీ పిలిపించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా కలెక్టర్ ఎలక్ట్రిక్ కుక్కర్ లో స్వయంగా అన్నం వండి అక్కడ ప్రజలకు ఎలా చేయాలో చూపించారు.
Read More..
దానిని ‘గేమ్ చేంజర్’ అనడం పెద్ద జోక్.. ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్