లక్ష్యసాధనకు విద్యార్థులు ముందు ఉండాలి
విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించేంత వరకు నిరంతరం కృషి చేయాలని సింగరేణి పాఠశాల కరస్పాండెంట్ జి. సుధాకర్ సూచించారు.

దిశ, ఇల్లెందు: విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించేంత వరకు నిరంతరం కృషి చేయాలని సింగరేణి పాఠశాల కరస్పాండెంట్ జి. సుధాకర్ సూచించారు. సోమవారం ఇల్లందు సింగరేణి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..విద్యార్థులు చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. విద్యార్థులు సెల్ఫో న్ కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు విద్యార్థుల నడవడికలపై దృష్టి సారించాలని కోరారు. పరీక్షా సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షా సమయానికి వారి సెంటర్ కి 20 నిమిషాలు ముందుగా వెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ జాయింట్ సెక్రటరీ యై. సునీల్ ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాస్, ఇంచార్జ్ స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాద్యాయులు, విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు.