యువతలో శక్తి సామర్థ్యాలను వెలికి తీసి దేశాభివృద్ధికి వినియోగించడమే ముఖ్య ఉద్దేశం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పవిత్ర పరివర్తన జ్ఞాన దీక్షలు జరుపుకుందాం, మహనీయులకు ఘన నివాళి

Update: 2025-03-15 08:25 GMT

దిశ, నేలకొండపల్లి : పవిత్ర పరివర్తన జ్ఞాన దీక్షలు జరుపుకుందాం, మహనీయులకు ఘన నివాళి అర్పిద్దాం అనే నినాదంతో స్వేరో పవిత్ర మాసం భీమ్ దీక్షను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ క్షేత్రం వద్ద శనివారం భీమ్ దీక్ష కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా ఆయనకు స్వేరో లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమ్ దీక్ష స్వేరో పవిత్ర మాసం నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుందన్నారు. ఏప్రిల్ 14న రంగారెడ్డిలో భీమ్ బిక్ష ముగింపు సభ ఉంటుందన్నారు. జ్ఞాన దీక్ష పవిత్ర మాసం ఆవిర్భవించింది.మన మహనీయులు సాధించిన విజయాల స్ఫూర్తితో మన యువతలో నిద్రాణంగా ఉన్న శక్తి సామర్ధ్యాలను వెలికి తీసి మన జాతుల ఆత్మగౌరవ ప్రదీప్తికి,దేశాభివృద్ధికి వినియోగించడమే ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం అన్నారు.ఈ నెల రోజుల పాటు స్వేరో జ్ఞాన ఖడ్గ ధారణ, స్వేరొ పవర్ నేమ్స్ పల్లె బస్తీ నిద్ర,బుక్ రీడింగ్ జ్ఞాన ముగ్గులు, ఆరోగ్య జాతర, భీమ్ విద్యానిధి, స్వేరో సునామి, భీమ్ విందు సర్కిల్ సందర్శన,భయ దహనం కార్యక్రమాలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో స్వేరోలు పాల్గొన్నారు.


Similar News