Lions Club : ఒకే రోజు.. రూ. 3 లక్షలతో సామాజిక కార్యక్రమాలు..

లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ కాపా మురళి కృష్ణ జన్మదిన వేడుకలు సందర్భంగా వైరాలో ఒకే రోజు సుమారు మూడు లక్షల రూపాయలతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Update: 2024-07-28 16:14 GMT

దిశ, వైరా : లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ కాపా మురళి కృష్ణ జన్మదిన వేడుకలు సందర్భంగా వైరాలో ఒకే రోజు సుమారు మూడు లక్షల రూపాయలతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైరాలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో డాక్టర్ కాపా మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైరా లయన్స్ క్లబ్, గ్రేట్ విజన్ క్లబ్ సభ్యులతో కలిసి కాపా మురళీకృష్ణ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వైరా లయన్స్ క్లబ్ అధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వరావు అధ్యక్షతన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రేట్ విజన్ క్లబ్ అధ్యక్షులు తోటకూర శ్రీకాంత్ లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి ఇద్దరు నిరుపేద విద్యార్థులకు రాయితీతో రెండు లాప్టాప్ లను పంపిణీ చేశారు. నిరుపేదలకు నిత్యావసర వస్తువుల కిట్లు, నిరుపేద కూరగాయల వ్యాపారులకు పది తోపుడు బండ్లను అందజేశారు.

15 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ పేదలకు సాయం చేసినప్పుడే మానవజన్మకు సార్థకత లభిస్తుందని చెప్పారు. పేదలు ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. సమాజంలో మనతో పాటు ఇతర వర్గాల ప్రజల కూడా సుఖసంతోషాలతో ఉండాలని వారికి కావలసిన సహాయ సహకారాలు అందించినప్పుడే మానవజన్మకు సార్థకత ఉంటుందని అన్నారు. అనాధలకు సహాయం చేయాలనుకుంటే సహృదయంతో ముందుకు రావాలని ఆయన కోరారు. పుట్టినరోజు సందర్భంగా మూడు లక్షల రూపాయలతో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించిన వైరా లయన్స్ క్లబ్ లను మురళీకృష్ణ అభినందించారు. వైరాలోని రెండు లయన్స్ క్లబ్బులు కూడా సేవ మార్గంలో నడుస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నాయని అన్నారు.

వైరా కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వేలాది ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో మురళీకృష్ణ చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో వైరా లయన్స్ క్లబ్ గ్రేట్ విజన్ క్లబ్ సెక్రెటరీ కోశాధికారులు అబ్బూరి రమేష్, మరికంటి రాంగోపాల్, ఉయ్యూరు రామకృష్ణ, జీఎస్టీ కో ఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు, జోన్ చైర్మన్లు వుండ్రు వరలక్ష్మి, పెనుగొండ ఉపేందర్రావు, జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ లగడపాటి ప్రభాకర్ రావు, రీజియన్ సెక్రెటరీ నాగేశ్వరరావు, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, పీఆర్ఓ ఏపూరి రాజారావు, క్లబ్ ల సభ్యులు పులికృష్ణార్జునరావు, నాళ్ళ నాగేశ్వరరావు, చెరుకూరి శ్రీనివాసరావు, మచ్చా రామారావు, మిట్టపల్లి నాగి, సూర్యదేవర శ్రీధర్, వీరారెడ్డి, చింతోజు నాగేశ్వరరావు, సీత హనుమాయమ్మ, నూకల ప్రసాద్ రావు, నూకల శ్రీనివాసరావు, షేక్ లాల్ అహ్మద్, పిచ్చిరెడ్డి, గజ్జల కృష్ణమూర్తి, గంగవరపు కిషన్ రాయి, కొల్లా రాంబాబు, మరికంటి శివ, కొమ్మినేని అశోక్, ఉండ్రు అజయ్ జస్వంత్, వై బుచ్చి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News