దీక్షా దివాస్ కు వెయ్యి మంది కార్యకర్తలు తరలిరావాలి

కొత్తగూడెం నియోజకవర్గం నుండి 1000 మంది కార్యకర్తలకు తగ్గకుండా దీక్షా దివాస్ కార్యక్రమానికి తరలి రావాలని వనమా రాఘవ పిలుపునిచ్చారు.

Update: 2024-11-27 10:36 GMT

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గం నుండి 1000 మంది కార్యకర్తలకు తగ్గకుండా దీక్షా దివాస్ కార్యక్రమానికి తరలి రావాలని వనమా రాఘవ పిలుపునిచ్చారు. బుధవారం టీబీజీకేఎస్ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 29వ తేదీన దీక్ష దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి జన సమీకరణ చేయాలని కోరారు.

     ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ లు బుక్య సోనా, బాదావత్ శాంతి, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ అంబుల వేణు, రుక్మేందర్ బండారి, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మాజీ ఎంపీటీసీలు, మాజీ కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల కమిటీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 


Similar News