'తహశీల్దార్ గారు జర జాలి చూపండి.. కావాలనే మా పేరు తొలగించారు..'

దిశ కూసుమంచి: నా పేరు పల్లపు అలివేలు, మాది గట్టు సింగారం గ్రామం. మా ఊరి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఏం జరుగుతుందో..latest telugu news

Update: 2022-06-06 13:01 GMT

దిశ కూసుమంచి: నా పేరు పల్లపు అలివేలు, మాది గట్టు సింగారం గ్రామం. మా ఊరి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకు నలుగురు పిల్లలు.. వారిలో ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు. నా భర్త నా పిల్లల చిన్నతనంలోనే మరణించాడు. నేను సుతార్ పని చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేశాను. నా కొడుకులకు ఎటువంటి జీవనాధారం లేక ఖాళీగా ఉన్నారు. కనీసం నాకు ఇల్లు లేదు, భూమి లేదు. ఒకవేళ నాకు ఎటువంటి భూమి ఉన్నా.. అది గ్రామ పంచాయతీకి రాసి ఇస్తానని బాధితురాలు చెప్పుకొచ్చింది. ఈ మధ్య పనికి వెళ్లిన సందర్భంలో ప్రమాదవశాత్తు నా కాలు విరిగింది ఇప్పుడు మా కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉంది. గతంలో మా ఊరుకి తహశీల్దార్ గారు వచ్చి డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులను ఎంపిక చేశారు. అందులో అనేకమార్లు నా పేరు ఉన్నది.ఈ క్రమంలో డబుల్ బెడ్రూం అర్హులైన పేదలందరితో పాటు మేము కూడా ఇంట్లోకి వెళ్ళాము. హఠాత్తుగా ఆర్‌ఐ డబుల్ బెడ్రూం ఇంటిలో నుండి మమ్మల్ని వెళ్లగొట్టి, నీకు గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని రికార్డ్‌లో ఉన్నదని ఇంటికి తాళం వేసి బయటకి వెళ్లగొట్టారు.

నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అధికారులు చెప్పేంతవరకు కూడా ఆ విషయం నాకు తెలియదు. ఎప్పుడొచ్చిందో? ఎవరికీ ఇచ్చారో? తెలియదు రికార్డులో ఉన్నదంట ఇప్పుడు నాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వనని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాం. కావున మండల అధికారులు నాయందు దయవుంచి ఇందిరమ్మ ఇండ్లపై సరైన సమాచారం తెలుసుకుని పేదరాలు అయిన నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రాధేయ పడుతున్నానని బాధితురాలు మిడియతో చెప్పుకొచ్చింది.

నిర్ధాక్షణ్యంగా మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు..


నా పేరు దగ్గుల సైదమ్మ W/o ఉప్పలయ్య. డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితాలో నా పేరు అనేక సార్లు వచ్చింది. దారుణమైన విషయం ఏమిటంటే పసల ఉప్పలి అనే వ్యక్తి ఇల్లు చూపించి.. ఆ ఇల్లు మాకు సంబంధించినదే అని ఎవరో చెప్పారు అంటా అని వారి మాటలు విని తహశీల్దార్ నువ్వు డబుల్ బెడ్రూం ఇంటికి అనర్హులు అని అంటున్నారు. మేము నెత్తి నోరు కొట్టుకుని చెప్పిన నిజం, చెప్పిన మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అర్హులైన పేదలందరం ఈ మధ్య కాలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల లోకి వెళ్ళాము. అధికారులు వచ్చి మీకు ఇందిరమ్మ ఇల్లు ఉన్నదని.. ఖాళీ చేయించి తాళం వేసి బయటకు పంపించారు. గత 20 సంవత్సరాలుగా కిరాయికి ఉంటున్నాను. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు విచారణ జరిపి మాకు ఇల్లు మంజూరు చేయగలరని కోరుతున్నారు.


Similar News