కేసీఆర్ ఉద్యమ నేపథ్యం రాబోయే తరానికి తెలియాలి

కేసీఆర్ సచ్చుడో.... తెలంగాణ వచ్చుడో అనే నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Update: 2024-11-29 13:34 GMT

దిశ, ఖమ్మం : కేసీఆర్ సచ్చుడో.... తెలంగాణ వచ్చుడో అనే నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దీక్ష దివాస్ సుందరంగా ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలాభిషేకం చేశారు. అక్కడ నుంచి నేరుగా అమరవీరుల స్థూపం చేరుకొని అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ... కేసీఆర్ 11 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు తీసుకొని వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఆంధ్ర పెట్టుబడిదారులు అడ్డం పడుతున్న కేసీఆర్ పసిగట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఇతర మార్గాల్లో తీసుకొని వెళ్లి గాంధీయ మార్గంలో రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.

    నేటి యువత కేసీఆర్ ఉద్యమ పటిమను గుర్తు చేసుకొని వారి రంగాల్లో రాణించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ అనే నినాదంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల్లో అనేక రంగాలను అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని కేసీఆర్ రైతుబంధు ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ... కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ గా మారిందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల కంటే దీటుగా అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు.

    తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. కేసీఆర్ తో పాటు జైలు జీవితం గడిపిన ఉద్యమకారులను సన్మానించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ లింగాల కమల్ రాజ్, మాజీ సూడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


Similar News