వైభవంగా శ్రీ తిరుపతమ్మ,గోపయ్య స్వామి కల్యాణం..

కూసుమంచి మండలం ధర్మ తండా సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కల్యాణం వైభవంగా జరిగింది.

Update: 2025-03-14 14:11 GMT
వైభవంగా శ్రీ తిరుపతమ్మ,గోపయ్య స్వామి కల్యాణం..
  • whatsapp icon

దిశ, కూసుమంచి రూరల్ : కూసుమంచి మండలం ధర్మ తండా సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కల్యాణం వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది పాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ తిరుపతమ్మ- గోపయ్య స్వామి కల్యాణం వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది పౌర్ణమి రోజున శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి కల్యాణ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఆలయ ప్రధాన అర్చకులు చిలకమర్రి స్వామినాథ్ వారి బృందం రంగబాలాజీ, సందీప్ స్వామి, కోయిల ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. ముందుగా గణపతి పూజ, గౌరీ పూజ చేసిన అర్చకులు జిలకర బెల్లం అనంతరం స్వామివారికి కల్యాణ నిర్వహించారు. పదుల సంఖ్యలో దంపతులు పీఠలపై కుర్చోని స్వామి వారి కల్యాణం జరిపించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామములోని భక్తులు మాజీ సర్పంచ్ పీపీలి బిక్షం దంపతులు, తండా లోని ప్రజలు, దేవాలయ కమిటీ నెంబర్లు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎండలు మండుతున్నందున మంచి నీటి సౌకర్యంతో పాటు భారీగా టెంట్లు వేశారు. కల్యాణం అనంతరం గిరిజనులు నృత్యాలు చేశారు. భక్తి పాటలకు డ్యాన్స్ లు వేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ నిర్వహాకులు వడ్తియా లచ్చిరాం, జర్పుల వీరన్న, జర్పుల భద్రు, చెరుకుపల్లి వీరయ్య, జర్పుల బీక్యా, జర్పుల భద్రు, కిరణ్మయి, జర్పుల కృష్ణ-గోజి, జర్పుల ధర్మ-సరిత, జర్పుల బిక్ష్మం- ప్రమిళా, వస్తాయా శంకర్-అరుణ, కొమ్ము మల్లయ్య-వీరమ్మ దంపతులు ఫీఠలపై కుర్చున్నారు. జర్పుల బిక్ష్మం, జర్పుల ధర్మ కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు.


Similar News